Monday, January 20, 2025

వెబ్‌సైట్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకుండా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో హాజరయ్యే విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,12,325 మంది విద్యార్థులు హాజరుకానుండగా, మొదటి సంవత్సరం విద్యార్థులు 2,70,583 మంది, రెండో సంవత్సరం 1,41,742 మంది హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News