Sunday, January 19, 2025

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందబాటులోకి తీసుకువచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫొటో, సంతకం, పేరు, మీడియంతో పాటు ఏయే సబ్జెక్టులు రాస్తున్నారో గమనించాలి. వాటిలో ఏవైనా తప్పులు ఉంటే తక్షణమే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్స్ సంతకాలు లేకపోయినా విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డు చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.

పిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో టిఎస్‌పిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ ఎ.అరుణ కుమారి వెల్లడించారు. జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన పిజిఇసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీలలో మార్పులను మార్పును గమనించాలని కన్వీనర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News