- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ టిఎస్‌ఐపాస్ అద్భుతంగా ఉందని విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ ప్రశంసించారు. మంగళవారం ఎంపి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపనకు చాలా అనుకూలంగా ఉందని కొనియాడారు. ఎపిలో 45 రోజులైనా రాని అనుమతులు తెలంగాణలో ఒక్క రోజులోనే పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయని మెచ్చుకున్నారు. ఇప్పటి నుంచి తన వ్యాపారాలు అన్ని తెలంగాణలో ఉంటాయని వివరించారు. విశాఖలో వేధింపులు ఎక్కువ కావడంతో విశాఖను వదిలి హైదరాబాద్ లో వ్యాపారం చేస్తానని జివివి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: మహారాష్ట్రలో దారుణం: సంకెళ్లు వేసి కూలీలతో వెట్టిచాకిరీ
- Advertisement -