Wednesday, January 22, 2025

లా సెట్ తొలి విడతలో 5363 సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఐదేళ్లు, మూడేళ్లు ఎల్‌ఎల్‌బి తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. కన్వీనర్ కోటాలో 6324 సీట్లు అందుబాటులో ఉండగా 5363 సీట్లను కేటాయించారు. మొదటి విడతలో మొత్తం 14,817 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా వారిలో 5363 మందికి మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు కేటాయించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బిలో 3901 సీట్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బిలో 1462 సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, ఈ నెల 6వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News