Monday, December 23, 2024

రేపు టిఎస్ లాసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఈనెల 15వ తేదీన టిఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు మాసబ్ ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్.లింబ్రాది విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొపెసర్ బి. విజయలక్ష్మి తెలిపారు. టిఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25న తేదీన మూడు సెషన్లలో జరిగింది. ఈ ప్రవేశ పరీక్షకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా, 36,218 మంది పరీక్షకు హాజరైయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747 మంది పోటీ పడ్డారు. లాసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్‌లో lawcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News