Thursday, January 23, 2025

ఎగిసిపడుతున్న ఎర్ర బంగారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీజన్ ప్రాంరభంలోనే ఎర్రబంగారం ధరలు ఎగిసి పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎండు మిర్చికి భారీగా డిమాండ్ ఏర్పడింది. క్వింటాలు ఎండుమిరప దేశవాళీ రకం రూ.80వేల మార్కు దాటేసింది. వరంగల్ మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.80100కు చేరి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా మనదేశం ఎండు మిరప సాగు, ఉత్పత్తిలో అగ్ర స్థానం లో ఉండగా , జాతీయంగా ఎండుమిరప సాగు చే స్తున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధమ స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండించిన ఎండు మిరప నాణ్యతపరంగా ఉత్తమ లక్షణాలు కలిగిఉండటంతో ఆంతర్జాతీయ మార్కెట్లో ఈ ప్రాంత మిర ప హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న ధరలను చూసి రైతులు పెద్ద ఎత్తన ఎండు మిరప మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది అధికవర్షాలు, చీడ పీడల సమస్యలు మిరప పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి.

దీంతో డి మాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లకు సరుకు రావటం లే దు. మరోవైపు అంతర్జాతీయంగా మిరపకు డిమాం డ్ పెరుగూతూ పోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిరప పంటలో 25శాతం పంట మనదేశంలోనే ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ పండించిన పంట ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి జరుగుతోంది. మనదేశంనుంచి ఏటా 14లక్షల మెట్రిక్‌టన్నుల ఎండు మిరప వివిధ దేశాలకు ఎగుమతి అవుతుండగా , చైనా నుంచి 4.5లక్షల టన్నులు, మెక్సికో నుంచి 4లక్షల మెట్రిక్ టన్నులు, పాకిస్తాన్ నుంచి 3.5లక్షల మెట్రిక్ టన్నుల సరుకు వివిధ దేశాలకు ఎగుమతి జరుగుతున్నట్టు సుగంధ ద్రవ్యపంటల బోర్డు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News