Friday, November 15, 2024

లారీ యజమానులకు అండగా ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత లారీ యజమానులకు ప్రభుత్వం అండగా ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఆర్‌టిఏ వేధింపులు లేకుండా చూస్తామని, ఓవర్ లోడ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి లారీ యజమానులకు హామినిచ్చారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి లారీ ఫిట్‌నెస్ ఫీజును పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి లారీ యజమానుల, డ్రైవర్ల సంక్షేమంపై చర్చిస్తానని ఆయన హామినిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలుపై ఎపి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే టెలిఫోన్‌లో మాట్లాడారు. లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి త్వరలో ఉన్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన వారిలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ గౌడ్, కోశాధికారి వేముల భూపాల్, ఉపాధ్యక్షుడు అత్తాపురం రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News