Wednesday, January 22, 2025

సాయిచంద్ మృతిపట్ల మంత్రుల సంతాపం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల రాష్ట్ర మంత్రులు నీరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి మంత్రులు నివాళులర్పించారు.

సాయిచంద్ మృతిపట్ల సంతాపం తెలిపిన మంత్రులు.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రులు.. వారికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్ల పేర్కొన్నారు. సాయిచంద్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయి చంద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

Also Read: గాయకుడు సాయిచంద్ అకస్మిక మృతిపట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News