Thursday, January 23, 2025

బీచ్ వాలీబాల్ జట్టుకు మంత్రుల అభినందనలు

- Advertisement -
- Advertisement -

TS ministers congratulated players of beach volleyball team

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : బ్యాంకాక్‌లో జరిగే ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్‌కి ఎంపికైన సందర్భంగా బీచ్ వాలీబాల్ జట్టు క్రీడాకారులను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. శనివారం మంత్రుల సముదాయంలో క్రీడాకారులు వారిని కలిశారు. మే 20 నుంచి- 22 వరకు చెన్నై నగరంలో జరిగిన 22వ అల్ ఇండియా బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ బీచ్ వాలీబాల్ క్రీడాకారులు శ్రీకృతి, ఐశ్వర్యలు గోల్ మెడల్ సాధించి బ్యాంకాక్‌లో జరిగే ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బీచ్ వాలీబాల్ జట్టు క్రీడాకారులను మంత్రులు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, తెలంగాణ బీచ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి హనుమంత్‌రెడ్డి, కోచ్ అన్వర్, సుదర్శన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News