Saturday, December 21, 2024

ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో మంత్రుల భేటి..

- Advertisement -
- Advertisement -

 TS Ministers Meeting with CM KCR at Pragathi Bhavan

హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో వరి అంశంపై టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు భేటి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్న మంత్రలులు సిఎం కెసిఆర్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో జరిగిన పరిణామాలను సిఎం కెసిఆర్ కు మంత్రులు వివరించడంతోపాటు పలు అశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు సిఎం కెసిఆర్ నూతన సచివాలయాన్ని సందర్శించనున్నారు.

 TS Ministers Meeting with CM KCR at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News