Wednesday, January 22, 2025

సచివాలయం ప్రారంభానికి కోడ్ గ్రహణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కారణంగా సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. నూతన అసెంబ్లీ భవనాన్ని ఈ నెల 17వ తేదీన అత్యంత అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శరవేరంగా సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సచివాలయం ప్రారంభోత్సం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. అలాగే అనేక రాజకీయ పార్టీల నేతల అగ్రనేతలను కూడా సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరింది.

ఇక కోట్లాది రూపాయలతో సచివాలయంలో సర్వంగా సుందరంగా పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఖాళీ అయిన స్థానిక ఎంఎల్‌సి స్థానానికి రెండు రోజుల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. వాస్తవానికి సచివాలయం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది.

దేశానికే తలమానికంగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయాన్ని రూ. 610 కోట్ల రూపాయల వ్యవయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సచివాలయం మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా వైభవంగా ప్రారంభం కానుంది. ఇక సచివాలయ ప్రారంభ వేడుకలను అన్ని నియోజకవర్గాల్లోనూ ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది.

150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సచివాలయాన్ని నిర్మించారు. 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మాణ పనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. రాష్ట్రానికే ఐకాన్‌గా నిర్మితమైన సచివాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం మరో ఐదు రోజుల్లో జరిగేందుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో… ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కారణంగా ఆ భవనం అందుబాటులోకి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News