Wednesday, January 22, 2025

పోలీస్ ఆఫీసర్లకు మెడల్స్ అందజేసిన టిఎస్ ఎన్‌టిపిసిఎల్ సిఎండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 75వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ పతకాలను పోలీస్ ఆఫీసర్లకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గురువారం హన్మకొండ విద్యుత్ భవన్ కార్పోరేట్ కార్యాలయంలో
ఏపి టిఎస్ చీఫ్ విజిలెన్సు ఆఫీసర్ బి .జనార్దన్ ఆధ్వర్యంలో సిఎండి అన్నమనేని గోపాల్ రావు ఈ మేరకు డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐలకు స్వాతంత్య్ర దినోత్సవ మెడల్స్‌ను అందచేశారు. కాగా ఈ స్వాతంత్య్ర దినోత్సవ మెడల్‌లను తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ సంబంధిత అధికారులకు పంపించగా వాటిని బహుకరించారు. మెడల్ అందుకున్న వారిలో డిఎస్‌పి వి.వి . రమణ మూర్తి , సిఐలు డి. శ్రీలక్ష్మి, కర్రే స్వామి , జె.రాజా శేఖర్ , ఏ.సురేష్ , ఎస్‌ఐలు కె . కుమార స్వామి , కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు .

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News