Monday, January 20, 2025

టిఎస్ పిఇసెట్ షెడ్యూల్ విడుదల..15 నుంచి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యాయామ విద్య(బిపిఇడి, డిపిఇడి కోర్సు)లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పిఇసెట్) 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీన పిఇసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ విసి, టిఎస్ పిఇసెట్ చైర్మన్ ఎస్ మల్లేశ్, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల విసిలు గోపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్‌లతో కలిసి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యర్థులకు రూ. 500, మిగతా కేటగిరీల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు.రూ. 500 ఆలస్య రుసుంతో మే 15 వరకు, రూ. 2 వేల మే 20 వరకు, రూ. 5 వేలతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్‌లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ మూడో వారంలో ఫలితాలను విడుదల చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News