Monday, December 23, 2024

ఎల్లుండి పిఇసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

TS PECET Physical Events on 21st

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు టిఎస్ పిఇసెట్ పిజికల్ ఈవెంట్స్ బుధవారం(సెప్టెంబర్ 21) నిర్వహించనున్నట్లు కన్వీనర్ వి.సత్యనారాయణ తెలిపారు. ఒక్కరోజు జరిగే ఈవెంట్లలో మొదటగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో ప్రారంభమై, 100 మీటర్ల పరుగు, షార్ట్ పుట్, లాంగ్ జంప్ మూడు అంశాల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వ్యాప్తంగా ఆరు సెంటర్లలో పిఇసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలకు పురుషులకు విడివిడిగా ప్రత్యేకమైన సెంటర్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, సిద్దిపేటలోని వేద కళాశాల, వరంగల్‌లోని వాగ్దేవి కళాశాలలో, పురుష అభ్యర్థులకు చౌటుప్పల్‌లోని ఎంఎంఆర్ కళాశాలలో, ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ కళాశాలలో, నల్గొండలోని శ్రీకృష్ణ కళాశాలలో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం వరకు మొత్తం 3 వేల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News