జూన్ 6 నుంచి ఫిజికల్ టెస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్(బిపిఇడి), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యూకేషన్(డిపిఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ పరీక్షలను జూన్ 6 నుంచి నిర్వహించనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన పిఇసెట్ కమిటీ సమావేశంలో పిఇసెట్ షెడ్యూల్‌ను ఖరారైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పిఇసెట్ పరీక్ష నోటిఫికేషన్‌ను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. మార్చి 8వ తేదీ నుంచి మే 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మే 17 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, జూన్ 7 నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి తుది పరీక్షల నిర్వహణ ఉంటుంది. అనంతరం వారం రోజులకి ఫలితాల వెల్లడించనున్నారు. బిపిఇడికి దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రి ఉత్తీర్ణత అయి ఉండి,1జులై,2021 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే డిపిఇడికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత అయి 1జులై,2021 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. పూర్తి వివరాల కోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.