Monday, December 23, 2024

31 నుంచి పిజిఇసెట్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ ప్రవేశాలకు నిర్వహించే పిజిఇసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన పిజిఇసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 31 నుంచి ఆగస్టు 18 వరకు వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్‌బాబు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో పిజిఇసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వి.వెంకటరమణ,ఎస్‌కె మహమూద్, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, పిజిఇసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. పిజిఇసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 18 వరకు ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 26వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, అదే నెల 19 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News