Thursday, January 23, 2025

ప్రశాంతంగా టిఎస్ పిజి ఈసెట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః జెఎన్టీయూ నిర్వహించిన టిఎస్ పిజి ఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్శిటీల పరిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మెటిక్స్, ఫార్మసీ కోర్సులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు జరిపారు.

ఉదయం సెషన్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మధ్యాహ్నం సెషన్‌కు 88.01 శాతం మంది హాజరైనట్లు పీజీ ఈసెట్ కన్వీనర్ వెల్లడించారు. మంగళవారం ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, మెకానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సు, ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, ఈనెల 31వ తేదీన ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరిం గ్ పరీక్షలు ఉన్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన ఇన్విరాల్ మెంట్ మేనేజ్‌మెంట్, నానో టెక్నాలజీ పరీక్షలు నిర్వహిన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News