Sunday, January 19, 2025

పెండింగ్ చలాన్ వాహనదారులకు శుభవార్త..

- Advertisement -
- Advertisement -

TS Police to held special drive on Pending Challan

హైదరాబాద్: పెండింగ్ చలాన్ వాహనదారులకు పోలీస్‌ శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదనను పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు పోలీస్‌ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. పెండింగ్ చలాన్లలో 2 వీలర్ వాహనదారులకు 25 శాతం చెల్లింపునకు అవకాశం కల్పించింది. మిగతా 75 శాతం చెల్లింపులను మాఫీ చేయబోతున్న పోలీస్‌శాఖ ప్రకటించింది. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. ఇక, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో సుమారు రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

TS Police to held special drive on Pending Challan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News