Monday, January 27, 2025

నేడు పాలిసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

నేడు పాలిసెట్ పరీక్ష
ఉ.11 గంటల నుంచి మ.1 గంట వరకు పరీక్ష
ఉ.10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
నిమిషం నిబంధన అమలు
రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష బుధవారం(మే 17) జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9,342 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, గంట ముందుగానే అంటే ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒఎంఆర్ షీట్‌ను రెండు వైపులా వివరాలను పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుందని, కాబట్టి విద్యార్థులు ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లపై ఫొటో ప్రింట్ కాని విద్యార్థులు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.

గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్షా కేంద్రం గుర్తింపు
విద్యార్థులు గూగుల్ మ్యాప్స్ ద్వారా తమ పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు స్మార్ట్‌ఫోన్లల ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్‌బిటిఇటిటిఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలని డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు. అందులో హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయగానే పరీక్షా కేంద్రం కోడ్, విద్యార్థి పేరు, సెంటర్ చిరునామా తదితర వివరాలు చూపిస్తాయని, గూగుల్ మ్యాప్స్ ద్వారా విద్యార్థి ఉన్న స్థానం నుంచి పరీక్షా కేంద్రం దూరాన్ని తక్షణమే తెలుకోవడంతో పాటు సరైన మార్గాన్ని నావిగేట్ చేస్తుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News