- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2023 పరీక్ష బుధవారం(మే 17) జరగనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి శ్రీనాధ్ తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, అందులో ఎంపిసి విద్యార్థులు 83,210 మంది, ఎంబైపిసి విద్యార్థులు 22,446 మంది ఉన్నారని తెలిపారు.
- Advertisement -