Wednesday, January 22, 2025

జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించనున్నారు. రెండు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టనుండగా, తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 22న వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, జూన్ 30న తొలి విడత సీట్లు కేటాయించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. జులై 7 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభించి, జులై 13న సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది. ఈసారి ఆన్‌లైన్ విధానంలో కన్వీనర్ కోటా ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చారు. జులై 24న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయించనున్నారు. జులై 23న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్

జూన్ 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
జూన్ 22 నుంచి 27 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లు
జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు
జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
జులై 9, 10 తేదీలలో రెండో విడత వెబ్ ఆప్షన్లు
జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు
జులై 21 నుంచి పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం
జులై 24న ఇంటర్నల్ స్లైడింగ్ పాలిసెట్ సీట్ల కేటాయింపు
జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాల విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News