- Advertisement -
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తులు బుధవారం(మార్చి 19) నుంచి ప్రారంభం కానున్నాయి. మే 13వ తేదీన పాలిసెట్ పరీక్ష జరుగనున్నది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 19 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోచ్చని అన్నారు. పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -