Tuesday, January 21, 2025

మే 24న పాలిసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం(మే 24) పాలిటెక్నిక్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు. పాలిసెట్ -2024కు రాష్ట్రవ్యాప్తంగా 92,808 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రం లోకి ఒక గంట ముందుగానే అంటే ఉదయం 10 గంటలకే అనుమతిస్తారని,

కాబట్టి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థులలో హాల్ టికెట్‌పై ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటో, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News