Monday, December 23, 2024

పాలిసెట్‌ ఫలితాలు పది రోజుల్లో విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పాలిసెట్ పరీక్షను నిర్వహించారు.

ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో పాలిసెట్ ద్వారా ప్రవేశాలను చేపట్టనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 98,273 మంది(92.94 శాతం) విద్యార్థులు హాజరయ్యారని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాధ్ తెలిపారు. ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News