Thursday, January 23, 2025

పాలిసెట్‌లో 82.77% ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొ మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌లో 82.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ 2023 ఫలితాలను విడుదల చేశారు. మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు 1,05,742మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 (92.94 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.వీరిలో80,752 మంది (82.77 శా తం) ఉత్తీర్ణత సాధించారు.ఇందులో 54,700 మంది బాలు రు, 43, 573 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొ మా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొ మా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించా రు.

పాలిసెట్‌లో సాధించేందుకుగానూ 120 మార్కులకుగా నూ 30శాతం మార్కులుఅంటే 36 మార్కులు పాందాల్సి ఉం టుం ది. ఎస్‌సి,ఎస్‌టి విద్యార్థులు ఉత్తీర్ణతకు ఒక మార్కు సాధించవలసి ఉంటుంది. పాలిసెట్‌లో ఎంపిసి విభాగంలో సూర్యాపేట చెందిన సురభి శరణ్య 119 మార్కులతో ప్రథమ ర్యాంకు సా ధించగా,షేక్ అబుబకర్ సిద్దిఖ్ 119 మార్కులతో రెండో ర్యాం కు, కౌడిపల్లికి చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్ కుమార్ 118 మూ డో ర్యాంకు సా ధించారు. అలాగే ఎంబైపిసి విభాగంలో రాష్ట్రస్థాయిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన 116 మార్కులతో చీర్ల ఆకాష్ మొదటి ర్యాంకు సాధించగా, సూర్యాపేటకు చెందిన మిరియాల అక్షయ తార 116 రెండో ర్యాంకు, సూర్యాపేటకు చెందిన కైరోజు శశివధన్ 116 మూడో ర్యాం కు,కన్నఉజ్వన్116 మార్కులతో 4వ ర్యాంకు సాధించారు.
జూన్ 14 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు జూన్ 14 నుంచి కౌన్సె లింగ్ ప్రారంభం కానుంది. విద్యార్థులు వచ్చే నెల 14 నుంచి 17 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసు కోవాలని పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జూన్ 16 నుంచి 18 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెల 25 లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జూలై 1వ తేదీ నుంచి తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారం భమవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News