హైదరాబాద్ : పదోతరగతి పరీక్షలకు రాసే విద్యార్థులకు ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 30తో గడువు ముగిసినా విద్యార్థుల బస్‌పాస్‌లు చెల్లుబాటే అయ్యేవిధంగా ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం పరీక్షల నిర్వహణ ఆల్యం కావడంతో పరీక్షలు రాసే విద్యార్థులకు రవాణాపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా బస్‌పాస్‌ల గుడువు దాటినావారి గుర్తింపు కార్డులతో బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ సదుపాయం విద్యార్థులు పరీక్షలు పూర్తియ్యే వరకు ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఇంత వరకు పాస్ తీసుకోని విద్యార్థులు, కాల వ్యవధి ముగిసి పాస్ పోగొట్టుకున్నవారు కూడా రెండోపాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థినులకు జారీ చేసిన ఫ్రీ పాసులు, వారి ఐడి కార్డుతో ఈ పరీక్షలు పూర్తయ్యేవరకు వినియోగించు కోవచ్చని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ ఆర్‌టిసి జోన్ ఈడి ఈ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు.