Tuesday, January 21, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిఎస్ ఆర్టిసి బస్సు , ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీకొని బోల్తా పడింది. . ఈ ఘటనలో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News