Monday, December 23, 2024

తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష కోసం సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు.

మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఆగస్టు 28 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా, ఈ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు.. పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు ఉంటాయి. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో 3 గంటల పాటు ప‌రీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News