Wednesday, January 22, 2025

టిఎస్‌ సెట్‌- 2024 నోటిఫికేషన్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  2024 సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టిఎస్‌ సెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి TS SET 2024 నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు. ముఖ్య తేదీలను ప్రకటించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హతను నిర్ణయించడానికి ప్రతి ఏడాది సెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ – 2024 (Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. మే 14 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ లోనే సమర్పించాలి. జూలై 2వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది.  ఫైన్ తో జూలై 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి ‘సెట్’ హాల్ టికెట్లు ఇష్యూ చేస్తారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News