Friday, November 22, 2024

ఎస్‌ఐ, ఎఎస్‌ఐ రాత పరీక్ష ఫైనల్ కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఎస్‌ఐ, ఎఎస్‌ఐ రాత పరీక్ష తుది ’కీ’ విడుదలైంది. తుది కీ పై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్‌ఐ, ఎఎస్‌ఐ రాతపరీక్షలు నిర్వహించారు. మొత్తం 59,534 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలు రాశారు. ఎస్‌ఐ, ఎఎస్‌ఐ (పింగర్ ప్రింట్స్) విభాగాల్లో తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించింది, రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు.

హైద్రాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 81 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ‘కీ’ ని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు గురువారం విడుదల చేసింది. ఈ ‘కీ’పై అభ్యంతరాలుంటే చెప్పాలని తెలంగాణ పోలీస్ నియామకబోర్డు తెలిపింది. ఈ నెల 14వ తేదీ లోపుగా అభ్యంతరాలు తెలపాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లీష్, ,గణితం , జనరల్ స్టడీస్ , తెలుగు ప్రశ్నాపత్రాలకు అభ్యర్ధులు పరీక్షలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News