Monday, December 23, 2024

పరీక్షల తేదీ ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టిఎస్‌ఎల్ పిఆర్‌బి) ప్రకటించింది. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 5తో ముగియనుండటంతో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బోర్డు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్‌ఐ మెయిన్స్ రాత పరీక్ష ఉంటుంది.

కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 23న తుది పరీక్ష ఉంటుందని బోర్డు ప్రకటించింది. పలు ప్రత్యేక విభాగాలకు చెందిన పోస్టులకు సంబంధించిన పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 1 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్2 పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.
ఫైనల్ పరీక్షలు షెడ్యూలు ఇదే…
మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ (ఐటి అండ్ సిఒ) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 230 గంటల నుంచి సాయంత్రం 530 గంటల వరకు ఎస్‌సిటి ఎఎస్‌ఐ (ఎఫ్‌పిబి) టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ(పిటిఒ) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ఎస్‌సిటి కానిస్టేబుల్(డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపరు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఎస్‌సిటి (కానిస్టేబుల్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ/ఎఎస్‌ఐ పోస్టులకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటి టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ/ఎఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లీషు లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు. ఇక చివరగా ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి కానిస్టేబుల్ (సివిల్), ఇతర కానిస్టేబుల్ సమాన్ పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి కానిస్టేబుల్ (ఐటి అండ్ సిఒ) పోస్టులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు.మరోవైపు ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 8 నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియలో భాగంగా తొలుత పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల రన్నింగ్, మహిళా అభ్యర్థులకు రన్నింగ్ నిర్వహిస్తున్నారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఎత్తును కొలుస్తారు. ఎత్తు కొలతలో అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షాట్‌పుట్ నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే ఫిజికల్ ఈవెంట్స్ విషయంలో ప్రస్తుతం గర్భిణిలుగా ఉన్న అభ్యర్థులకు మినహాయింపు ఇస్తూ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో పలువురు మహిళలు గర్భిణులుగా ఉండటంతో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనకుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది. మెయిన్స్‌లో వారు ఉత్తీర్ణత సాధిస్తే నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News