హైదరాబాద్: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా టోర్నమెంట్ లో రెండవ సారి గోల్డ్ మెడల్ సాదించి సెప్టెంబర్ నెలలో చైనాలో జరిగే ఆసియన్ గేమ్స్, బాక్సింగ్ ఈవెంట్ లో పాల్గొనడానికి భారతదేశం తరపున తెలంగాణ బాక్సర్, నిఖత్ జరీన్ అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న నిఖత్ జరీన్ కు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన్మోహన్, ఇండియన్ బాక్సింగ్ మాజీ కోచ్ చిరంజీవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ రాజ్ లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి నిఖత్ జరీన్ కు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి అభినందనలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 10 నుండి 25 వరకు, చైనాలో జరిగే ఆసియన్ గేమ్స్ లో పాల్గొనడానికి భారత బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని అన్నారు.తెలంగాణ నుండి 2022 ఏషియన్ గేమ్స్ కు అర్హత సాధించిన తొలి తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ అని, ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు నిఖత్ జరీన్ రానున్న రోజుల్లో సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల తరపున బాక్సర్ నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, దీంతోపాటు వరల్డ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ ఈవెంట్, ఇస్తాంబుల్ లో జరిగే బాక్సింగ్ ఈవెంట్ కు కూడా భారత దేశం తరపున నిఖత్ జరీన్ క్వాలిఫై అయింది.
TS Sports Athourity Chairman grand welcome to Boxer Nikhit Jarin