రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఎస్‌ఎస్‌సి) శుక్రవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
తేదీ పరీక్ష సమయం
2025 మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30
మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30- నుంచి 12.30
మార్చి 24 ఇంగ్లీష్ ఉదయం 9.30- నుంచి 12.30
మార్చి 26 గణితం ఉదయం 9.30 నుంచి -12.30
మార్చి 28 సైన్స్ పార్ట్ 1(ఫిజిక్స్) ఉదయం 9.30 నుంచి -11.00
మార్చి 29 సైన్స్ పార్ట్ 1(బయాలజీ) ఉదయం 9.30 నుంచి -11.00
ఏప్రిల్ 2 సోషల్ స్డడీస్ ఉదయం 9.30- నుంచి 12.30