Monday, December 23, 2024

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

TS SSC Advanced Supplementary results released

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 79.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షలకు 55,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 48,167 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 38,447 మంది’(79.82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 14,614 మంది(82.21 శాతం) అమ్మాయిలు, 23,833 మంది(78.42 శాతం) అబ్బాయిలు ఉన్నారు. బాలికల ఉత్తీర్ణత, బాలుర ఉత్తీర్ణత కంటే 3.79 శాతం అధికంగా నమోదైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు శుక్రవారం పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుడల చేశారు. ఈ పరీక్షల ఉత్తీర్ణతలో 97.99 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 53.11 శాతంతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం శనివారం(సెప్టెంబర్ 3) నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ ఎ.కృష్ణారావు తెలిపారు. రీ వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి, రీ కౌంటింగ్‌కు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

TS SSC Advanced Supplementary results released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News