హైదరాబాద్ : రాష్ట్రంలో వారంలోగా టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. మరో ఒకటి రెండు రోజుల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేసి, తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఫలితాల ప్రక్రియపై అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. ఫలితాల వెల్లడిలో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలను ఒకటి, రెండు సార్లు పరిశీలిస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ తప్పులు మాత్రం దొర్లకూడదని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు, పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం సాంకేతికంగా అన్ని అంశాలను పరిశీలించి ఫలితాలను విడుదల చేయనున్నారు.
వారంలోగా టెన్త్, ఇంటర్ ఫలితాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -