- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి ఈ నెల 1వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను www.bse.telangana. gov.in, www.bseresults.telangana.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.
TS SSC Results 2022 Releasing Tomorrow
- Advertisement -