- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధా రెడ్డి కీని విడదల చేశారు. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈనెల 27వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. టెట్ ఫైనల్ కీ విడుదలలో జాప్యం వల్లనే ఫలితాల వెల్లడి ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల15న విడుదల చేసిన ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు బుధవారం తుది కీని విడుదల చేశారు.
TS TET 2022 Result Primary Key Released
- Advertisement -