Wednesday, January 22, 2025

నేడు టెట్ ఫలితాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిఎస్ టెట్) 2023 ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన జరిగిన టెట్ పేపర్ -1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది( 84.12 శాతం) హాజరయ్యారు. బి.ఇడి విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్ -2కు 91.11 శాతం మంది హాజరయ్యారు. టెట్ పేపర్- 1, 2 ప్రాథమిక కీలు విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. బుధవారం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుండి వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News