Friday, December 20, 2024

టెట్ ప్రిమిలినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) ప్రిమిలినరీ కీ విడుదలయ్యింది. మే 20న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగియగా, ఒకరోజు వ్యవధిలోనే ప్రిమిలినరీ కీ, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా ప్రాథమిక కీ ని అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టెట్ ప్రాథమిక కీ లపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 12వ తేదీన టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,426 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 1కు 86.03 శాతం మంది, పేపర్ 2కు 82.58 శాతం మంది హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News