Friday, April 11, 2025

జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) 2024 పరీక్షలు గురువారం(జనవరి 2) నుంచి ప్రారంభం కానున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి పది రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవిఎన్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి రోజు తొలి సెషన్‌కు ఉదయం 7.30 గంటలకు, రెండో సెషన్‌కు 12.30 గంటలకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రెండోసారి నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 94,327 దరఖాస్తులు రాగా, పేపర్ 2కు 1,81,426 దరఖాస్తులు వచ్చాయి. ఏమైనా సమస్యలు ఉంటే అభ్యర్థులు 7032901383, 9000756178,7075088812, 7075028881,7075028882, 7075028885 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News