Monday, November 18, 2024

టిఎస్ టెట్ ఎగ్జామ్ మే 20 నుంచి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్(టిఎస్ టెట్) మే 20 నుంచి జూన్ 2 వరకు జరుగనున్నాయి. పరీక్షలు మొదలయిన తర్వాత 15 నిమిషాల నుంచి ఎవరినీ లోనికి అనుమతించరు. విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఉదయం 8.45, మధ్యాహ్నం 01.45 తర్వాత ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు గేట్లు మూసేస్తారు. పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులు వెళ్లిపోడానికి అనుమతించరు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడెంటిటీ కార్డు.. అంటే ఆధార్, డైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్, ఓటర్ కార్డు ఏదో ఒకటి తేవాల్సి ఉంటుంది.

టిఎస్ టెట్ తొలిసారి కంప్యూటర్-బేస్డ్ మోడ్ లో నిర్వహించబోతున్నారు. టెట్ కు దాదాపు 286386 దరఖాస్తులు అందాయి. వివరాలు కావలసిన వారు అధికారిక వెబ్సైట్ దర్శించాలి. అవి: schooledu.telangana.gov.in or tstet2024.aptonline.in/tstet/

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News