Sunday, April 13, 2025

టెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రారంభం జూన్ 15 నుంచి 30
వరకు పరీక్షలు జులై 22న
విడుదల కానున్న టెట్ ఫలితాలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుండగా, జూన్ 9 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతేడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

15 నుంచి దరఖాస్తులు
టెట్ రాసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 నుంచి 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి నరసింహారెడ్డి వెల్లడించారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http:// schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉపాధ్యాయ నియామకాలలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుం ది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత (టె ట్) పరీక్ష డిఎస్‌సి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. టెట్ నిర్వహణకు 90 రోజుల సమ యం పట్టనుండగా,

అంతకు ముందే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలి. టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్‌సిటిఇ పొడగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు. ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. అయితే ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలు టెట్ ఉత్తీర్ణతను పరిగణలోకి తీసుకోకపోయినా భవిష్యత్తులో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించినా పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News