- Advertisement -
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ శుక్రవారం(జనవరి 24) విడుదల కానుంది. ఈ నెల 27 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ తుది కీ ఖరారు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈనెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు పది రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించారు.
టెట్ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది(74.44 శాతం) హాజరయ్యారు. టెట్ పేపర్ 1కు 94,327 మంది దరఖాస్తు చేసుకోగా, 69,476 మంది(73.65 శాతం) హాజరు కాగా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 93,263 మంది దరఖాస్తు చేసుకోగా, 69,390 మంది(74.40 శాతం), పేపర్ 2 సోషల్ స్టడీస్‌కు 88,163 మంది దరఖాస్తు చేసుకోగా, 66,412 మంది(75.33 శాతం) హాజరయ్యారు.
- Advertisement -