Sunday, January 19, 2025

టెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

TS TET results released

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అధికారులు ఫలితాలను వెల్లడించారు. ఈ మేరకు టెట్ ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరి చారు. టెట్ పేపర్-1లో 1,04,078 మం ది (32.68 శాతం) అభ్యర్థులు అర్హత సాధించగా, పేపర్-2లో 1,24,535 మం ది శాతం) అర్హత సాధించారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పే పర్-1కు 3,18,444 మంది, పేపర్ -2కు 2,51,897 మంది అభ్యర్థులు హాజర య్యారు. తాజాగా విడుదలైన ఫలితాల కోసం https://tstet.cgg.gov.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు.

సైన్స్ సబ్జెక్టులో మెరుగైన ఉత్తీర్ణత

టెట్ ఫలితాలలో పేపర్ 2లో గణితం, సై న్స్ సబ్జెక్టులలో మెరుగైన ఉత్తీర్ణత నమోదైంది. ఈ సబ్జెక్టులలో టెట్ రాసేందుకు 1,49,315 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,34,037 మంది(57.67 శాతం) అర్హత సాధించారు. అలాగే సాం ఘిక శాస్త్రం సబ్జెక్టులో 40.41 శాతం అర్హ త నమోదైంది. సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు మొత్తం 1,28,578 మంది దరఖాస్తు చే సుకోగా, 1,16,860 మంది అర్హత సా ధించినట్లు అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News