Wednesday, January 22, 2025

ఎపి విద్యుత్ బకాయిలపై హైకోర్టులో టిఎస్ ట్రాన్స్‌కో రిట్

- Advertisement -
- Advertisement -

TS Transco writ in High Court on AP electricity dues

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎపి ట్రాన్స్‌కో నుంచి విద్యుత్ బకాయిలు తమకు రావాల్సి ఉందని, బకాయి మొత్తం రూ.1730 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని టిఎస్ ట్రాన్స్‌కో తెలంగాణ హైకోర్టులో రిట్ వేసింది. అసలు రూ.1267 కోట్లు, వడ్డీ రూ.463 కోట్లు కలిపి చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని టిఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ సి. శ్రీనివాస రావు రిట్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, ఎపి ట్రాన్స్‌కో, పెన్షన్ అండ్ గ్రాట్యూటి ఫండ్ ట్రస్టులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే తరహాలో బకాయిలు చెల్లించాలంటూ ఇదివరలో వేసిన మరో కేసుతో కలిపి ఈ రిట్‌ను అక్టోబర్ 13న విచారిస్తామని జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ శ్రీనివాసరావుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగుల ట్రస్ట్‌కు చెందిన పి అండ్ జి , పిఎఫ్, ఈఎల్, గ్రాట్యూటి వంటి బకాయిలు రూ. 674 కోట్లు, దానిపై వడ్డీ రూ.38 కోట్లు చెల్లించాలని ట్రాన్స్‌కో స్టాండింగ కౌన్సిల్ చెప్పారు. ట్రాన్స్‌మిషన్ అండ్ ఎస్‌ఎల్‌డిసి చార్జీలుగా రూ.105 కోట్లు, వడ్డీ రూ. 85 కోట్లు, డిస్కం బాండ్ల నిమిత్తం అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ. 253 కోట్లు, ఐసిడిఎస్, డెబిట్ సర్వీసింగ్ మొదలైన వాటి కింద అసలు రూ.128 కోట్లు వడ్దీ రూ.87 కోట్లు చొప్పున మొత్తంగా అసలు 1267 కోట్ల, మొత్తం వడ్డీ రూ. 463 కోట్లు కలిపి రూ.1730 కోట్లు ఎపి ట్రాన్స్‌కో చెల్లించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News