Sunday, December 22, 2024

సోనాపూర్ కు బస్సు నడిపించండి

- Advertisement -
- Advertisement -

కాసిపేటః మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేసి నెలలు గడుస్తున్న నేటికి ఆర్‌టిసి అధికారులు పునరిద్దరించడం లేదని గట్రావ్‌పల్లి గ్రామస్తులు శనివారం నిరసన వ్యక్తం చేసారు. మంచిర్యాల బస్‌డిపో నుండి కాసిపేట మండలం సోనాపూర్ వరకు ఆర్‌టిసి సంస్థ బస్సు నడిపింపించే వారని బస్సు వల్ల గట్రావ్‌పల్లి, సాలెగూడ, సోనాపూర్, లక్ష్మీపూర్, వెంకటాపూర్, కుర్రెగాడ్, కోలంగాడ, మల్కేపల్లి, తాటిగూడ, ధర్మరావుపేట, కొండాపూర్ గ్రామస్తులకు రవాణ సౌకర్యంగా ఉండేదని వారు అన్నారు.

గతంలో దెయ్యం పేరుతో ఆర్‌టిసి అధికారులు సోనాపూర్ బస్సును క్యాన్సిల్ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాంగ్రేస్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఆనందకరం అయినప్పటికి పేద గిరిజన, పేద మహిళలకు మాత్రం ఆర్‌టిసి బస్సు అందుబాటులో లేకుండా పోయిందని వారు వాపోయారు. ఇప్పటికైన ప్రభత్వం స్పందించి గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేనా నాయకులు పెంద్రం ప్రభాకర్, ఉయిక మోతిరాం, సిడాం మోహాన్, ఆడె సంపత్, సిడాం కృష్ణ, కుర్సింగ రవీందర్, రమేష్ మహిళలు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News