Thursday, January 23, 2025

టిఎస్‌పిఎస్‌సి బోర్డును రద్దు చేయాలి : కోదండరాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సడక్ బంద్ కార్యక్రమంపై నిర్బంధం దురదృష్టకరమని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డును రద్దు చేయాలని, నూతన బోర్డు నియమించిన తరువాతే పారదర్శకంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్‌తో విపక్ష కాంగ్రెస్, టిజెఎస్, బిఎస్‌పి,, సిపిఐ ఎంఎల్, (ఎన్‌డి), సిపిఐ ఎమ్‌ఎల్, ప్రజా పంధా, సిపిఐ, సిపిఎం, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సడక్ బంద్ సందర్భంగా పోలీసులు కోదండరామ్‌ను గృహనిర్బంధం చేశారు. ఉదయం 6 గంటల నుండే విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు అఖిల పక్షం నాయకులు కోదండరామ్ నివాసానికి చేరుకుని సడక్ బంద్ కార్యక్రమానికి పూనుకున్న సమయంలో పోలీసులు అఖిల పక్ష నాయకులను కోదండరామ్ నివాసం నుండి బయటికి రాకుండా నిర్బంధించారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణలో ఒక్క ఉద్యోగ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని టిఎస్‌పిఎస్‌సి బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు, అఖిల పక్షo, విద్యార్థి సంఘాలు అడిగితే బోర్డును ఎందుకు రద్దు చేయడం లేదో, దీని వెనుక ఉన్న అసలు దోషులు ఎవరో ముఖ్యమంత్రి మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు కోట్లాడి ఉద్యోగాలు సాధించు కోవాలని పిలుపునిచ్చారు.  సడక్ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన అఖిలపక్ష, విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులను, నిరుద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు గోవర్థన్, అరుణ, చలపతి రావు,సర్దార్ వినోద్ కుమార్, సలీం పాషా, నర్సయ్య, శ్రీధర్, ఆశప్ప, మోహన్ రెడ్డి, తుల్జ రెడ్డి, అరున్ కుమార్, ఆంజనేయులు, రవి కాంత్, శ్రీనివాస్, బసoథ్, నరహరి, అంజి గౌడ్, రమణతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News