మన తెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. బరిలో మొత్తం 60 మంది నిలిచారు. 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నివేదితారెడ్డితో పాటు మరో 16 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఉప ఎన్నికకు సంబంధించి 78 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుండగా, మే 2న కౌంటింగ్ జరుగనుంది. గతంలో బిజెపి తరపున పోటీ చేసిన నియోజకవర్గ ఇంఛార్జ్ కంకణాల నివేదితారెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ల పత్రాలు అందించారు. అయితే ఆ తర్వాత డాక్టర్ రవికుమార్‌ను బిజెపి అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇకపోతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున సీనియర్ నేత జానారెడ్డి, టిఆర్‌ఎస్ తరపున దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్, టిడిపి తరపున మొవ్వా అరుణ్‌కుమార్ బరిలో నిలిచిన సంగతి విదితమే.
TSEC Rejected 17 Nominations in Sagar bypoll