Monday, December 23, 2024

ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -
ఫలితాలు విడదుల చేసిన చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 18వ తేదీన నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 26,994 మంది(98.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విసి గోపాల్‌రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణారావు, కో కన్వీనర్ శంకర్‌లతో కలిసి సోమవారం ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 211 బి.ఇడి కాలేజీల్లో 18,350 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతేడాది 13,756 సీట్లు భర్తీ అయినట్లు పేర్కొన్నారు.

టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
1. గొల్ల వినీష(తాండూరు, వికారాబాద్)
2. నిషా కుమారి(బేగంపేట్, హైదరాబాద్)
3. ఎం సుశీ(బర్కత్‌పుర, హైదరాబాద్)
4. వాసాల చంద్రశేఖర్(మెట్‌పల్లి, జగిత్యాల)
5. అకోజు తరుణ్ చంద్(శ్రీరాంపూర్, పెద్దపల్లి)
6. తోన్పూల ప్రశాంత్(ఆదిలాబాద్ రూరల్)
7. మహ్మద్ షరీఫ్ సీ(శేరిలింగంపల్లి, రంగారెడ్డి)
8. కుసుమ వినయ్‌కుమార్(కోనసీమ, ఆంధ్రప్రదేశ్)
9. మోటపోతుల అరుణ్ కుమార్(అబ్బాపూర్, ములుగు)
10. ఎ. లక్ష్మీ గాయత్రీ(ఎస్‌ఆర్ నగర్, హైదరాబాద్)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News