మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశాల కోసం నవంబరు 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు మొదటి, తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన కోసం నవంబరు 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నవంబరు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నవంబరు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. నవంబరు 14న ఎంబిఎ, ఎంసిఎ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నవంబరు 21 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 21న ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 22న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన, 22, 23న తుది విడత వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. 26న తుది విడత సీట్లను కేటాయించనున్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 28న మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
నవంబర్ 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -